Magazines

ఢిల్లీలో పోలీసు రాజ్యం నడుస్తోంది: ఎంపీ మల్లు రవి

3 గంటల క్రితం

acpt
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

సర్ "ద్వారా 13.కోట్లు ఓటర్లు తొలగింపు 

 విలేకరుల సమావేశంలో ఎంపీ.మల్లు రవి 
నవతెలంగాణ- అచ్చంపేట

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు రాజ్యం నడుస్తోందని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ప్రతి పౌరునికి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఓటు హక్కు లేకపోతే దేశంలో రాష్ట్రంలో సమాజంలోనే..ఆ వ్యక్తికి విలువ లేదని అన్నారు. "సర్ " ద్వారా 13 కోట్ల ఓటర్లను ఎలక్షన్ కమిషన్ తొలగించడం దుర్మార్గమన్నారు.


ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జంతర్ మంతర్  వద్ద నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఢిల్లీకి రాకుండా 250 రైళ్ళను రద్దు చేసిందని, 34 మెట్రో స్టేషన్లను మూసివేసిందని మండిపడ్డారు. మోడీ నియంత ప్రభుత్వం వల్ల..ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. విలేఖర్ల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరాములు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్