Magazines

ఉప్పల్‌లో భారీ చోరీ: 48తులాల బంగారం,రూ. 3.5లక్షల నగదు అపహరణ

1 గంట క్రితం

Major theft in Uppal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ ఉప్పల్‌:

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ దొంగతనం చోటుచేసుకుంది.ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో నివాసముంటున్న గంగం భాస్కర్ రెడ్డి,బాలమణి దంపతులు సోమవారం మధ్యాహ్నం కొమురవెల్లి క్షేత్రానికి వెళ్లారు.మంగళవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు.అందరూ కలిసి లోపలికి వెళ్లాక చోరీ జరిగినట్టు గుర్తించారు.సమాచారం అందుకున్న ఇంటి యజమాని భాస్కర్ రెడ్డి వెంటనే కొమురవెల్లి నుంచి తిరిగొచ్చి పరిశీలించగా,ఇంట్లోని సుమారు 48తులాల బంగారం,కిలోన్నర వెండితో పాటు రూ. 3.5లక్షల నగదు చోరీకి గురైనట్టు తేలింది.బాధితుడి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని,నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్