ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌను
ప్రజలంతా సుఖశాంతులతో విరసిల్లాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలలో ఆయన పాల్గొని కుటుంబ సభ్యులకు పట్టువస్త్రాలు, స్వీట్లు, టపాకాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీపావళి అందరికీ సంతోషాలను తెచ్చిపెట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర్, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, పి ఎ సి ఎస్, చైర్మన్ జనగామ ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కే సాగర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, నీలం పద్మా వెంకటస్వామి, వీవర్స్ చైర్మన్ దాసి శంకర్, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)