నవతెలంగాణ - ముధోల్
దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంమైన బాసరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బుధవారం మధ్యాహ్నం బాసరకు రానున్నారు. ఇందుకు సంబంధించిన మంత్రి షెడ్యూల్ ను అధికారికంగా మంగళవారం విడుదలైంది. హెలికాప్టర్ లో బాసరకు మంత్రి వస్తున్నారు. ముందుగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి దర్శించుకుంటారు. అనంతరం గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్ష సమావేశం ను మంత్రి నిర్వహించనున్నారు. అలాగే బాసర త్రిబుల్ ఐటీ లో సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఐటీ మంత్రి కావడంతో విద్యార్థులతో ముఖాముఖి కూడా ఉండవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నారు.
రేపు బాసరకు మంత్రి శ్రీధర్ బాబు రాక
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)