నవతెలంగాణ - ముధోల్
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి అమ్మవారి నిలయమైన బాసరకు బుధవారం రావలసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన రద్దయింది. అదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. మంత్రి బాసర అమ్మవారిని దర్శించుకుని సమీక్ష సమావేశ అనంతరం బాసరట్రిపుల్ ఐటీని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి అక్కడ కూడా సమీక్ష నిర్వహించాల్సి ఉండేది. అయితే ఆదిలాబాద్ మంత్రి పర్యటన ఆలస్య కావటంతోపాటు, హైదరాబాదులో అత్యవసర సమావేశం ఉండడంతో మంత్రి బాసర పర్యటన రద్దు అయినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి పర్యటన ఉండటంతో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, ఉదయం నుండి బాసర చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు కూడా బాసరకు వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో వచ్చారు. మంత్రి పర్యటన రద్దు కావడంతో అందరూ వెనుతిరిగి వెళ్ళారు.






కామెంట్‌లు (0)