Magazines

ఏఎంసీ చైర్మన్‌గా చల్లగుళ్ల నియామకంపై మంత్రి తుమ్మల అభినందనలు 

27 నిమిషాల క్రితం

minister Tummala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా చల్లగుళ్ల నరసింహారావును నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చరవాణి (ఫోన్) ద్వారా నరసింహారావుకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఆయన వెంట ఉన్న సమయంలోనే మంత్రి ఈ నియామకంపై స్పందించి అభినందించడం విశేషం. సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి వ్యవసాయ శాఖ మంత్రిగా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చల్లగుళ్లకు మంత్రి తుమ్మల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్