Magazines

మురసు తుఫాన్..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

2 గంటల క్రితం

Minister Tummala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మురసు తుఫాను ప్రభావం ఈరోజు (మంగళవారం) రాత్రి నుంచి ఖమ్మం జిల్లాపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల  హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతున్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వర్షాల వల్ల జలమయమయ్యే అవకాశాలు ఉన్నందున అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ఖమ్మం జిల్లా వైపు కదులుతున్నందున పరిస్థితి తీవ్రతను అధికారులకు వివరించి, దిశానిర్దేశం చేశారు. అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.


ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను మంత్రి  ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావలసిందిగా మంత్రి తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్