Magazines

మెరుగైన వైద్య సేవల గురించి మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే

2 గంటల క్రితం

MLA Bandari Lakshma Reddy submits a memorandum to Minister Damodara Raja Narasimha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఈసీ నగర్, చర్లపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శాశ్వత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈసీఐఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే వివరించారు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాన్ని అందించేందుకు హౌసింగ్ సొసైటీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ అంశంపై గతంలో 2026 జనవరి 8న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈసీ నగర్, చర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పీహెచ్‌సీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీ నగర్ వాసులు, బీఆర్ఎస్ నాయకులు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్