Magazines

చర్లపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి

1 గంట క్రితం

Mla Bandari
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – నాచారం 

చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ, ఈసీ నగర్, రామకృష్ణ నగర్ ప్రాంతాల్లో రూ.1.09 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కోటి రూపాయల వ్యయంతో 900 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు, ఆఫీసర్స్ కాలనీలో రూ.9 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులను ఆయన ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంతో కాలనీల్లో రాకపోకలు సులభతరం అవుతాయని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటంతో మురుగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.


ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్