నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అవుట్డోర్ స్టేడియం పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అవుట్ డోర్ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ స్టేడియం నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం కమల్ పాషా, మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ, ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నండ్రు గోపి, ఏఎంసీ మాజీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, పలువురు కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)