నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణంలోని లక్కీ అపార్ట్‌మెంట్స్ 1, 2లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, మాజీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
పట్టభద్రుల ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు కోరారు. రాత్రి వేళల్లో సైతం అపార్ట్‌మెంట్లలో పర్యటిస్తూ నమోదు ప్రక్రియపై వివరాలు అందించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)