కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు సమ్మయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు
గణపతి సచ్చిదానంద స్వామీజీ మంథని పర్యటనపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రాసిన లేఖను కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సిసెల్ అధ్యక్షుడు మంత్రి రాజసమ్మయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆధ్యాత్మిక గురువులపై గౌరవం లేకుండా -వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు గణపతి సచ్చిదానంద స్వామీజీ మంథనికి విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారని తెలిపారు.
సమాజంలో ప్రశాంతత, సోదరభావం, ధార్మిక చింతన పెంపొందించాలనే సందేశాన్ని స్వామీజీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమంపై ఎంపీ లేఖ రాయడం సమంజసం కాదన్నారు. స్వామీజీ పర్యటనకు రూ.3కోట్లు ఖర్చు చేశారంటూ మాట్లాడటానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించారు. మంథనికి వచ్చినప్పుడు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఇతర పార్టీల నాయకులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)