నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని పెద్దఎక్లారా గ్రామాన్ని మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి శనివారం సందర్శించారు. ఇందులో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట రామ్ రెడ్డి, కారోబార్ తులసిరామ్, ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)