Magazines

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాను జయప్రదం చేయాలి

1 గంట క్రితం

outsourcing employees
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

గిరి యాదయ్య 

నవతెలంగాణ-మర్రిగూడ 

హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఈనెల 26న సిఐటియు ఆధ్వర్యంలో జరిగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాను జయప్రదం చేయాలని మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య పిలుపునిచ్చారు.శనివారం స్థానికంగా ఆయన మాట్లాడారు.నాలుగు లేబర్ కోడ్ ల రద్దు,కనీస వేతనం,ఉద్యోగ, సామాజిక భద్రత,ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ,పిఆర్సి అమలు,డీఏ వర్తింపు,ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ధర్నా కొనసాగుతుందని తెలిపారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా ను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్