నవతెలంగాణ-మర్రిగూడ
భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన శనివారం మండలంలోని శివన్నగూడ గ్రామంలో చోటుచేసుకుంది. నాంపల్లి సీఐ దూది రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడ గ్రామానికి చెందిన సుంకరి ఇంద్రయ్య కుటుంబ కలహాలతో తన భార్య సుంకరి రజితను (37) శనివారం మేకలు కోసే మటన్ కత్తితో అతి దారుణంగా గొంతు కోశాడు. దీంతో రజితకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు.
గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న మర్రిగూడ పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అని, ఓ కుమారుడు గత రెండేళ్ల క్రితం మృతి చెందినట్టు తెలిసిందని అన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు.






కామెంట్లు (0)