Magazines

క్రాంతినగర్‌ మహిళలకు ఎమ్మెల్యే సర్‌ప్రైజ్‌

3 రోజుల క్రితం

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

బతుకమ్మ సంబరాల్లో ఆకస్మికంగా ప్రత్యక్షం..
ఆడబిడ్డలకు దసరా శుభాకాంక్షలు

నవతెలంగాణ – ఆలేరు 

పూలను పేర్చి బతుకమ్మను కొలుస్తున్న మహిళల మధ్యకు ఓ అతిథి అనూహ్యంగా వచ్చారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ మధ్యకు వచ్చిన ఎమ్మెల్యేను చూసి క్రాంతినగర్‌ మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఇలా ఆకస్మికంగా ప్రత్యక్షమై మహిళలకు దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.


ఎలాంటి హంగూ ఆర్భాటాలు, ప్రోటోకాల్‌ సందడి లేకుండా సాధారణ వ్యక్తిలా నేరుగా మహిళల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే.. వారి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. పండుగ వేళ తమ మధ్యకు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేతో మహిళలు ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.

పూల పండుగ వేళ తమ మధ్యకు వచ్చిన ఎమ్మెల్యే రాకతో క్రాంతినగర్‌లో బతుకమ్మ సంబరాలు మరింత సందడిగా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్