నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేర్ పట్టణంలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలను అందంగా అలంకరించి, బతుకమ్మలను ముస్తాబు చేశారు. ఇందులో భాగంగా బతుకమ్మలను ఆకర్షణీయంగా తయారు చేసిన వారికి ఆలేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్, నవతెలంగాణ రిపోర్టర్, బాలసుగుణ ఫౌండర్, ఎలుగల కుమారస్వామి, వారి తల్లిదండ్రులు (సుగుణ-బాలనరసయ్య) జ్ఞాపకార్థం బహుమతులను అందజేశారు.
ఈదునూరి భాగ్యమ్మ, అల్లం రేణుక, చింతపంటి ఉమలు మొదటి మూడు బహుమతులను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను ఆడిన మహిళలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంతోషిమాత ఉపాసకులు వేదాటి రామన్న పంతులు, శివాలయం ప్రధాన అర్చకులు వేదాటి సత్యనారాయణ శాస్త్రి, ఒకటో వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక, హరీష్, వేదాటి లక్ష్మీ ఎలుగల స్వర్ణలత వెలగల పద్మ,
కొలను పాక రోడ్ సంతోష్ నగర్ రైల్వే కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)