Magazines

పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఐదోసారి గుజ్జ భాస్కర్ ఏకగ్రీవం

1 గంట క్రితం

Gujja Bhaskar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రొగ్రెసివ్ రికగ్నైస్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వరుసగా 5వసారి తుంగతుర్తి నివాసి, ఉపాధ్యాయుడు గుజ్జ భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని జి.ఎం గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పీఆర్‌టీయూ నూతన శాఖను ఎన్నుకున్నారు. పీఆర్టీయూ సంఘంలో చేసినటువంటి కృషికి గుర్తింపుగా వీరిని ఎన్నిక చేయడం జరిగింది.


గుజ్జ భాస్కర్ తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయనశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన‌ని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరి ఎన్నిక పట్ల పిఆర్టీయూ తుంగతుర్తి మండల అధ్యక్షులు పోతురాజు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కార్యవర్గ సభ్యులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్