- మున్సిపల్ ఛైర్ పర్సన్
నవతెలంగాణ -ఆలేరు టౌను
ఆలేరు మున్సిపాలిటీలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని, మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం సిల్క్ నగర్లో నీటి సమస్య తలెత్తగా,వృథాగా ఉన్న బోరుకు మోటారు బిగించి నీటి సౌకర్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని, వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. బోరుకు మోటారు బిగించి నీటి సమస్యను పరిష్కరించడంతో సంతోషం వ్యక్తం చేసిన సిల్క్ నగర్ వార్డు ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేగోటి వెంకటేష్, బిరు వెంకటేష్, గొట్టిపాముల నర్సింలు, కృష్ణ, చిట్టి, మిల్ల కృష్ణ, భేదిచెందు, చింతకింది సిద్దులు, చింతకింది సత్యనారాయణ, చింతకింది బేతి ఆంజనేయులు, గారిపెళ్లి యాదగిరి, రంగ, యాదగిరి, చింతకింది గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)