నవతెలంగాణ - తిరుమలగిరి
తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, అనంతారంలో బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్య యొక్క ప్రాముఖ్యత, సమాజ అభివృద్ధిలో విద్య పాత్ర, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలపై తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ విద్యావంతులై సమాజాభివృద్ధికి తోడ్పడాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ షేక్ చాంద్ పాష సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షేక్ చాంద్ పాష పాల్గొన్నారు.







కామెంట్లు (0)