నవతెలంగాణ-మద్నూర్
ఎల్ కె ఆర్ ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గం స్థాయి బతుకమ్మ పండుగ వేడుకలకు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మొదట, రెండవ, మూడవ బహుమతులతో పాటు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక బహుమతి అందజేయనున్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని గుండూర్ రోడ్డులో ఈనెల 13 న మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదట బహుమతి రూ.51000/-, రెండవ బహుమతి రూ.25000/-, మూడవ బహుమతి రూ.11000/- అందించనున్నారని పేర్కొన్నారు. మన తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలకు ఆడపడుచులందరూ భారీగా తరలి వచ్చి, విజయవంతం చేయాలని కోరారు.







కామెంట్లు (0)