నవతెలంగాణ - డొంకేశ్వర్
మండలంలోని నికాల్ పూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బతుకమ్మలను ఒక చోట ఉంచి.. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.." అంటూ ఆడి పాడారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)