గొబ్బియలు వేసిన సర్పంచ్ దంపతులు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో మంగళవారం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి రకరకాల పూలతో పెద్ద బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. సర్పంచ్ దంపతులతో పాటు పంచాయితీ పాలకవర్గ సభ్యులు, మహిళ సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని గుండూర్ రోడ్డులో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు చేపట్టిన నియోజకవర్గం స్థాయి బతకమ్మ సంబరాలకు మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సభ్యులు భారీ బతుకమ్మను తయారు చేసుకొని తరలి వెళ్లారు.
గ్రామపంచాయతీ ఆవరణంలో బతుకమ్మ సంబరాలలో ఆటపాటలు అందరినీ ఆకర్షింపజేశాయి. ఈ బతుకమ్మ సంబరాల పట్ల సర్పంచ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, పంచాయితీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, టౌన్ అధ్యక్షులు బండి గోపి, మైనారిటీ మండల నాయకులు జావిద్ పటేల్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, నాయకులు సంఘయప్ప ,గంగాధర్ ,కర్ల సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు







కామెంట్లు (0)