నవతెలంగాణ - భీంగల్
భీంగల్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎమ్. చిరంజీవిని గురువారం ఎన్ఎస్‌యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. యువతగా, విద్యార్థి సంఘం నాయకులుగా సమాజంలోని మీ తోటి యువతను డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చైతన్య పరచాలని ఎస్ఐ చిరంజీవి ఎన్ఎస్‌యుఐ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, ఆసిమ్, షాజీ, నరేందర్, కిరణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.





కామెంట్‌లు (0)