నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని తాళ్లూరు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి రాజులపాటి రాజా రాములు కుమారుడు సతీష్, రిషిత వివాహా కార్యక్రమానికి హాజరై సీపీఐ(ఎం) జిల్లా, డివిజన్, నాయకులు నూతన వధూవరులను బుధవారం ఆశీర్వదించారు.
ఈ క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శిలం సత్యనారాయణ రెడ్డి, తాళ్లూరు వెంకటాపురం గ్రామ సర్పంచ్ నాయుడు వెంకటకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునురావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమల విఠల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి ముదిగొండ అంజయ్య, సిఐటియు నాయకులు గంపల శ్రీనివాసరావు, వెంకటాపురం సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి సోమభక్తిని కృష్ణ, రేస్ నాగేశ్వరరావు, చింతలపూడి పురుషోత్తం, ఊటుకూరు సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు చారి, నవతెలంగాణ విలేకరి పాటిబండ్ల సాంబశివరావు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బిఆర్ఎస్ నాయకులు ఆశీర్వాదం నూతన దంపతులను మాజీ జెడ్పిటిసి కట్ట అజయ్ కుమార్, పోచారం సొసైటీ చైర్మన్ నర్వనేని అంజయ్య, గ్రామసర్పంచ్ నాయుడు వెంకటకృష్ణ, దేవబుక్తిని రాఘవరావు, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.



కామెంట్లు (0)