హ్యూమన్ రైట్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం ఎం గౌడ్
నవతెలంగాణ-అచ్చంపేట
ప్రజాహిత మానవ హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎంఎం గౌడ్ ను సెక్రటరీగా నియమించారు. ఈ సందర్బంగా ప్రజాస్వామ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని హ్యూమన్ రైట్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం.ఎం గౌడ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
దేశంలో పుట్టిన ప్రతి మనిషినీ నిర్బంధించకుండా, స్వేచ్ఛగా జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, కుల మత ప్రాంతా పేద ధనిక వివక్ష లేకుండా సమాన న్యాయంతో, హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా గౌరవంగా బ్రతకాలన్నారు. మానవ హక్కులను కాపాడుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఐక్యరాజ్యసమితి 30 అంశాలతో కూడిన సార్వత్రిక మానవ హక్కులను ఆమోదించింది. డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, విద్య, ఆరోగ్య హక్కులు ప్రధానమైనవి అన్నారు.
త్వరలోనే ప్రణాళిక బద్దంగా గ్రామాలలో పర్యటిస్తూ హ్యూమన్ రైట్స్ ల పైన ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తానని తెలిపారు.







కామెంట్‌లు (0)