Magazines

ఇష్టానుసారంగా అధికారుల విధులు....అడిగే నాథుడే లేడు 

1 గంట క్రితం

Officials perform
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

- పుల్కల్ ప్రభుత్వ కార్యాలయాల పనితీరే వేరు అధికారుల రూటే సపరేటు 

- సమయపాలన పట్టింపు లేదు ప్రశ్నించే వారే కరువు 

- పనుల కోసం వచ్చిన ప్రజలకు తప్పని ఇక్కట్లు అధికారుల కోసం పడిగాపులు 

నవతెలంగాణ పుల్కల్ 

ప్రభుత్వ పాలన ప్రజల్ని పరిశాన్ చేస్తుంది అధికారుల విధులు ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తుంది వేలాపాల పాటించకుండా ప్రభుత్వ అధికారులు నామ్కే వాస్తేగా ఉద్యోగాలు చేస్తున్నారు. అడిగే వారు కరువడంతో కార్యాలయాలకు తాళాలు కూడా తీయలేని దుస్థితి ఈ మండల కేంద్రంలో నెలకొంది, 

పుల్కల్ మండల కేంద్రంలోని ప్రధానమైన మెజిస్ట్రేట్ తాసిల్దార్ కార్యాలయంలో అధికారుల అడ్రస్ కనిపించడం లేదు ఉదయం 10:30 వరకు కూడా ఇక్కడ కార్యాలయ సిబ్బంది కనిపించకపోవడం చర్చాంశానియంగా మారింది, అటెండర్ ను మొదలుకొని తాసిల్దార్ వరకు ఈ కార్యాలయంలోని విధుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, ఈ విషయమై తాసిల్దార్ను ఆరా తీయగా తాను సెలవు పై ఉన్నట్టు వివరించారు. 


కిందిస్థాయి సిబ్బంది జాడ కనిపించలేదు, కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనం ఇవ్వడంతో ప్రజలు నిద్రపోతున్నారు, ఎంతో అవసరమైన పనుల కోసం సుధీర గ్రామాల నుండి అధికారులను కలిసేందుకు రోజుకు అనేకమంది ఈ కార్యాలయానికి వస్తూ ఉంటారు కానీ వారికి అధికారుల జాడ కనిపించకపోవడంతో నిద్దర పోతున్నారు, క్రమశిక్షణ రాహిత్యం, విధుల పట్ల నిర్లక్ష్యం జవాబు దొరితనం లేకపోవడం పట్ల ఈ కార్యాలయం పనితీరు అబ్బాస్ ఫాలు అవుతుంది ఇదిలా ఉంటే దీని పక్కన ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం తలుపులు కూడా తెర్చుకోలేదు, అదేవిధంగా దాని సమీపంలో ఉన్న మహిళ స్త్రీ శక్తి భవనం తలుపులు కూడా తెచ్చుకోలేదు అంటే ఈ కార్యాలయాల సిబ్బంది ఏ విధంగా విధులను వెలగబెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు, గ్రామ గ్రామానికి విస్తరించి ఉన్న ఈ కార్యాలయ సిబ్బంది విధుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం పై సర్వత్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.


మండల స్థాయి అధికారి విధుల పట్ల అలసత్వం వహించడం వివిధ కార్యాలయ సిబ్బందికి నిర్లక్ష్యo వహించడం ప్రధాన కారణమని తెలుస్తుంది సుపరిపాలన అందించలానే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక నిబంధనలను పెట్టింది ఆ నిబంధనలను తుంగలో తొక్కి నాన్ కే వాస్తేగా ఇక్కడ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని స్థానికుల ఆరోపణ ఈ విషయమై జిల్లా అధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యపు నీడను తొలగించాలని అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్