Magazines

మార్కెట్ లో ప్రయివేట్ కొనుగోళ్ల జోరు

2 గంటల క్రితం

Private purchases
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రయివేట్ వ్యాపారుల పత్తి కొనుగోళ్ళు జోరందుకున్నాయి. సోమవారం మార్కెట్ పరిధిలోని వర్దనందు పత్తి మిల్లు, గురుగోవింద్ పత్తి మిల్లుల్లో పత్తి కొనుగోళ్ళను ఆయా ఫ్యాక్టరీల యజమానులు ప్రయివేట్ పరంగా కొనుగోలు ప్రారంభించారు. ఇదివరకే కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్, నరసింహ జిన్నింగ్ మిల్లు, గోవిందు జిన్నింగ్ మిల్లు లలో పత్తి కొనుగోలు ప్రారంభించారు.


సోమవారం పత్తి కొనుగోళ్ల వ్యాపారులంతా గురు గోవిందు పత్తి మిల్లులో సమావేశమై పత్తి ధర నిర్ణయించుకున్నారు. క్వింటాల్ పత్తి ధర రూ.9501 ధర నిర్ణయించారు. పత్తి ధర ప్రయివేట్ కొనుగోలుదారులు మంచి ధర నిర్ణయించినందుకు పత్తి రైతులు ఆనందం వ్యక్తపరిచారు. ఈ ధర నిర్ణయించే కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రామచందర్ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పత్తి కొనుగోళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పత్తి వ్యాపారులు గురు సెట్, కాకాని సెట్, జ్ఞానేశ్వర్ సెట్ ,మధుకర్ సెట్, కోలావార్ సెట్, నరసింహ సెట్, గణేష్ జింగ్ సెట్, తదితరులతో పాటు మార్కెట్ పరిధిలోని కమిషన్ ఏజెంట్లు పత్తి రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్