మహబూబాబాద్ నియోజకవర్గస్థాయిలో ఉన్న కాలువలని క్లీన్ చేయడమే లక్ష్యం
నియోజకవర్గ స్థాయిలో రూ. 3కోట్లతో పనులు ప్రారంభం
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ఎస్సారెస్పీ డిబిఎన్ 48 కాలువలను ఉన్న మట్టిని ముళ్ళ చెట్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. సోమవారం మండలంలోని ఆలేరు గ్రామంలో ఎస్సారెస్పీ కాలువల మట్టి చెట్లను తొలగించే కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, ఎస్సారెస్పీ డి ఈ రాందాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సారెస్పీ కాలువలు మొత్తం మట్టితోని చెట్ల పదుల తోటి నిండి నీరు క్రింది స్థాయికి రాలేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి రావడంతో వెంటనే సంబంధిత శాఖ అధికారులను గతంలోని పిలిపించి ఈ బూడిద కార్యక్రమం గురించి రివ్యూ చేసి వెంటనే విధిలో మంజూరు కొరకు ప్రయత్నం చేశామని అన్నారు.
అందులో భాగంగా ఇప్పుడు మండలంలోని ఎస్సారెస్పీ కాలువలకు ఉన్న ఐదు ఉప కాలువలు 87 కిలోమీటర్ల పొడవు కాలువ ఉన్నటువంటి కూడికతీత చెట్ల తొలగింపు రెండు విభాగాలుగా మంజూరు అయ్యాయని తెలిపారు. అందులో ఐదు ఉపకాలవలు 10ఆర్, 10 ఆర్ వన్ 30 ఆర్ 15 ఆర్ 15 బి ఆర్ కాలువలకు రెండు విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి రూ.23.02, లక్షల 102.95 లక్షలు ఇందులో 90 అయ్యాయాన్ని చెప్పారు. ఇప్పుడు రైతులు వంటలు పంట వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని అన్నారు.
లెనిన్ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో కరెంటు ఉండకపోవచ్చని దాంతోపాటు నీరు కూడా పూర్తిస్థాయిలో సరిపోదని అన్నారు. రైతుల వరి పంట వేసి ఆర్థికంగా నష్టపోకూడదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, నాయకులు రామ్ సింగ్ భాస్కర్ ఆనంద్ భాస్కర్ నాయక్ బాలకృష్ణ గన్న హరీష్ గోగుల ప్రశాంత్ గూగుల అశోక్ కాలేరు మల్లేశం ఎస్ ఆర్ ఎస్ పి డి ఈ రాందాస్ ఏ ఈ లు సుష్మ ప్రణయ్ కుమార్ తోపాటు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)