Magazines

బసవేశ్వర భవన్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధుల మంజూరు

1 గంట క్రితం

Basaveshwara Bhavan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

మంత్ర పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వీరశైవ లింగాయత్ సమాజ ప్రతినిధులు

నవతెలంగాణ-మద్నూర్

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ను శుక్రవారం కామారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ప్రతినిధుల్లో మద్నూర్ డోంగ్లి మండలాల చెందిన లింగాయత్ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సమక్షంలో సమాజ ప్రతినిధులు మంత్రివర్యులను కలిసి, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 240లో ఒక ఎకరం భూమి కేటాయింపుతో పాటు, బసవేశ్వర భవన్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంలో అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


కార్యక్రమంలో మద్నూర్ మండలానికి చెందిన పెద్ద షక్కర్గ సర్పంచ్ విశాలాక్షి రామ్ పటేల్, మేనూర్ సర్పంచ్ అశోక్ పటేల్, పెద్ద ఎక్లారా సర్పంచ్ మహేష్ కుమార్, కొడిచర గ్రామ నివాసుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంతోష్ పటేల్, అలాగే డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, ఆ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్, వీరితోపాటు మద్నూర్, డోంగ్లి, మండలాలకు చెందిన లింగాయత్ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్