నవతెలంగాణ –రాయపోల్
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజాగౌడ్ సూచించారు. బుధవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నిర్వహణపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ , పంచాయతీ కార్యదర్శి లావణ్య తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)