నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల భవిత కేంద్రంలో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు మానసిక, శారీరకంగా ధృఢంగా ఉండేందుకు ఉపయోడపతాయని పేర్కొన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, శివ శంకర్, శివాజీ, ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీనివాస్, స్వప్న, ఐ ఈ ఆర్ పి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.




కామెంట్‌లు (0)