తుప్పు పడుతున్న పరికరాలు.!
లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా
పట్టించుకోని పంచాయతీ, మండల అధికారులు
నవతెలంగాణ-మిడ్జిల్
గత ప్రభుత్వ హయాంలో ఊరికో క్రీడా ప్రాంగణం అంటూ గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిడ్జిల్ మండలంలో అభాసుపాలవుతోంది. మండలంలోని వల్లభరావుపల్లి, వాడియాల, చిల్వేర్, మున్నా నూరు, రాయిలోని కుంట తాండ, దోనూర్, 25 గ్రామపంచాయతీలలో 20 గ్రామాలలో క్రీడా ప్రణాంగాలు నిర్మించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణాలు ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ముళ్ళపొదలు, కంప చెట్లు, దట్టంగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఆటలు ఆడుకోవడానికి తెచ్చిన ఖరీదైన క్రీడా పరికరాలు ఎండకు ఎండి, వానకు తడిసి పూర్తిగా తుప్పు పట్టి పోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ పరికరాలు విరిగిపోయి వృధాగా పడి ఉన్నాయి.
గ్రామాల్లో యువతకు ఆట స్థలాలు అందుబాటులో లేకుండా పోతున్నా. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు స్పెషల్ ఆఫీసర్లు, గానీ, మండల స్థాయి ఉన్నతాధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడంపై మండల ప్రజలు, క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఇలా బూడిదలో పోసిన పన్నీరులా వృధా చేయడంపై మండిపడుతున్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెతగా గుర్తొస్తుందని, ప్రజలు మండిపడుతున్నారు.
ప్రజల సొమ్ముతో క్రీడా ప్రణాంగాలు నిర్మించి వదిలేయడంతో క్రీడలు ఎలా నేర్చుకోవాలని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్రీడా ప్రాంగణాల్లో పెరిగిన కంప చెట్లను తొలగించి, క్రీడా పరికరాలను పునరుద్ధరించి యువతకు అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాణాంగాలలో పెరిగిన చెట్లను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. 25 గ్రామపంచాయతీలలో 20 గ్రామాలు క్రీడా మైదానాలను యువకులు క్రీడలు ఆడుకోవడానికి పనులు చేపడతామని చెప్పారు.






కామెంట్లు (0)