Magazines

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు:ఎస్సై శ్రీనివాసులు

4 గంటల క్రితం

sand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం



నవతెలంగాణ మిడ్జిల్

ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా దుందుభి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాసులు హెచ్చరించారు.ఆదివారం తెల్లవారుజామున మండలంలోని వాడియాల గ్రామ శివారులోని దుందుభి వాగు నుండి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.దీంతో వెంటనే స్పందించిన పోలీసులు దుందుభి నది పరివాహక ప్రాంతానికి చేరుకుని దాడులు నిర్వహించారు.అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్