Magazines

బాధిత కుటుంబానికి అండగా ‘సుధా హెర్బల్’ చారిటబుల్ ట్రస్ట్

1 గంట క్రితం

supports the victim's family
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి

దయనీయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యత అని అనువంశిక ఆయుర్వేద వైద్యురాలు, సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కొనకళ్ల  సుధారాణి అన్నారు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన జలగం నగర్ నివాసి ఈర్ల మురళి కుటుంబానికి ఆమె చేయూతను అందించారు. గతంలో ఒక కాలి వేళ్లు తొలగించినా, అరటిపండ్లు విక్రయిస్తూ మురళి తన జీవనోపాధిని కొనసాగించేవాడు.


​ఇటీవల రెండో కాలికి తీవ్రంగా సెప్టిక్ కావడంతో వైద్యులు ఆ కాలును కూడా తొలగించాల్సి వచ్చింది. మురళి రెండు కాళ్లు కోల్పోయి పూర్తి వికలాంగుడిగా మారడంతో ఆ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ​కొడుకును ఇంట్లోనే ఉండి చూసుకోవాల్సి రావడంతో తల్లి కూడా కూలి పనికి వెళ్లలేక తన జీవనోపాధిని కోల్పోయింది. ​వృద్ధుడైన తండ్రికి పని దొరికిన రోజే ఆ ఇంట్లో గంజినీళ్లు కాగుతాయని, లేని రోజుల్లో అర్ధాకలితో గడుపుతున్నారని డాక్టర్ సుధారాణి దృష్టికి వచ్చింది.


ఈ నేపథ్యంలో సుధారాణి మంగళవారం వారి నివాసానికి  వెళ్లి ఆ కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందించారు. ​అనంతరం వారి ఇంటి పెరట్లో ఒక మొక్కను నాటి, పరిసరాల పరిశుభ్రత, మొక్కల ప్రాధాన్యతను వివరించారు. మురళి త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహార నియమాలను వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్