Magazines

జిల్లా స్థాయి పోటీల్లో నారంవారిగూడెం విద్యార్థుల ప్రతిభ

1 గంట క్రితం

Talent
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

- నాలుగు విభాగాల్లో బహుమతులు కైవసం

నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ పోటీల్లో అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం పీఎంశ్రీ ఎంపీయూపీఎస్‌ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మంగళవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆనందఖనిలో నిర్వహించిన డ్రాయింగ్‌, నృత్యం, పాటలు, వేస్ట్‌ టు వెల్త్‌ పోటీల్లో పాల్గొన్న ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు బహుమతులు సాధించారు.


జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నప్పటికీ అశ్వారావుపేట మండలం విద్యా, సాంస్కృతిక రంగాల్లో ముందంజలో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రోత్సాహంతో నారంవారిగూడెం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులతోపాటు ఎస్కార్ట్‌ టీచర్‌ మంగమ్మను హెచ్‌ఎం పున్నం చంద్రశేఖర్‌రావు, గ్రామ సర్పంచ్‌ మనుగొండ నాగమణి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ తట్టుకోళ్ల బసవమ్మ, ఉపాధ్యాయులు బండి శ్రీనివాస్‌రెడ్డి, రేణుక, ఆశిక్‌ ఆలం, రవిబాబు, రజని, గ్రామ పెద్దలు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్