- పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్
నవతెలంగాణ - అశ్వారావుపేట
కళలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని పీఎం శ్రీ ప్రాథమికోన్నత పాఠశాల నారంవారిగూడెం ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం కొన్ని కళల్లోనైనా ప్రవేశం కలిగి ఉండాలని సూచించారు. సోమవారం పాఠశాల స్థాయిలో నిర్వహించిన ఆర్ట్ అండ్ కల్చరల్ వేడుకలకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
పాటలు, చిత్రలేఖనం, నాట్యం వంటి కళలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కళలను ప్రదర్శించడం లేదా వీక్షించడం ద్వారా ఉపశమనం పొందవచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో మంగళవారం నిర్వహించనున్న ఆర్ట్ అండ్ కల్చరల్ వేడుకల్లో పాల్గొనే విద్యార్థులను ఎంపిక చేసేందుకు పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బండి శ్రీనివాసరెడ్డి, రేణుక, ఆషిక్, రవిబాబు, మంగమ్మ, రజని, కవిత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)