కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
గుగులోతు దస్రు నాయక్ మృతి గ్రామానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్వగృహంలో దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర అంత ఉందని, అలాంటి వ్యక్తి మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రకాశ్ రెడ్డి, రాంరెడ్డి, నాయిని సత్యపాల్ రెడ్డి, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు సాయి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు సునీల్ నాయక్, మండల యూత్ అధ్యక్షులు రాజేష్,పీక్లా తండా సర్పంచ్ గుగులోత్ ఝాన్సీ నరేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)