Magazines

పరకాలకు వెలుగులు నింపడమే లక్ష్యం

9 గంటల క్రితం

Parakala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 2 నిమిషాల చదవడం

రాజకీయాలకతీతంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా

యువతకు క్రీడలు స్ఫూర్తినివ్వాలి.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ - పరకాల

వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో వెనుకబడుతున్న పరకాల పట్టణానికి కొత్త వెలుగులు తీసుకురావడమే తన లక్ష్యమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పరకాల అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

సోమవారం పరకాల పట్టణంలోని పద్మశాలి భవనంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరకాల ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) క్రికెట్ క్రీడాకారుల వేలం పాటను ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు పీపీఎల్ నిర్వహిస్తున్న నిర్వాహకులు చిన్ను, రాజేష్‌లను అభినందించారు.


ఒక సాధారణ మెకానిక్ కుటుంబంలో జన్మించి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన తిలక్ వర్మ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పరకాలతో పాటు పరిసర ప్రాంతాల యువకులు కూడా తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అదే స్ఫూర్తితో పరకాల ప్రీమియర్ లీగ్ ముందుకు సాగాలని నిర్వాహకులకు సూచించారు.మ్యాచి చివరి

రోజు మళ్ళీ తాను వస్తానని తనతో పాటు ఓ క్రీకెట్ సెలబ్రిటీని సైతం వెంటబెట్టుక రానున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన 12 టీంలు క్రికెట్ ఉత్తమ సత్తాను చాటి ఈ పరకాల ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు.

పరకాల పట్టణ అభివృద్ధిపై మాట్లాడుతూ.. పట్టణంలో అభివృద్ధి, వ్యాపార అవకాశాల విస్తరణ కోసం అనేకమంది వ్యాపార వర్గాలు తనను సంప్రదిస్తున్నారని తెలిపారు. పరకాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై అందరితో చర్చిస్తూ రాజకీయాలకు అతీతంగా పట్టణానికి వెలుగులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పరకాల ప్రాంత యువత కోసం ఎలాంటి సహాయనికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికె మహిళలకు కొత్త శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి కుట్టు మిషన్లతో పాటు, శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోచంపల్లి ఫౌండేషన్ అనేది ఈ పరకాల గడ్డమీద పుట్టినవాడిగా ఈ ప్రాంత ప్రజల కోసం అండదండలను అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో 

యువతకు ఆర్థిక భరోసా కనిపించడం కోసం తాను మరికొంతమంది కలిసి ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, కంప్యూటర్ తదితర రంగాలలో యువతకు 365 రోజులు శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికను తయారు చేయబోతున్నట్లు వెల్లడించారు.


పరకాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం తాను తనతో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి,సిరికొండ మధుసూదన చారి, నాగూర్ల వెంకన్న,మొలుగూరి బిక్షపతి, బిజెపి పార్టీకి సంబంధించిన డాక్టర్ సంతోష్ పరకాల గడ్డమీద పుట్టిన ప్రాంతవాసులుగా రాజకీయాలకతీతంగా అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ మాటలో రాజకీయాలు లేవంటూనే రాజకీయంగా తన ప్రత్యర్థులకు తాను ఈ ప్రాంతం నుండి రాజకీయాలలో ఉండనున్నట్లు చెప్పకనే చెప్పినట్లు తనదైన పద్ధతిలో వివరించడం కోసమెరుపు. 

అయితే ఆదివారం రాత్రి పరకాలలో జరిగిన పోచంపల్లి ఫ్లెక్సీల చింపివేతకు సంబంధించి శ్రీనివాసరెడ్డి వివరణ కోసం ప్రయత్నించగా 

అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందా కుమారస్వామి,బిఆర్ఎ‌స్ నాయకులు రాకేష్ రావు, పిట్ట సునీల్, నిర్వాహకులు రాజేష్, చిన్ను, బీఆర్ఎస్ నాయకులు గంట సమ్మిరెడ్డి, నందికొండ జయపాల్ రెడ్డి, ఆముదాలపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్