మున్నూరు కాపు రాజ్యాధికారం పార్టీ అధ్యక్షులు స్వర్ణలత పటేల్
నవతెలంగాణ-అచ్చంపేట
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవిని మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని మున్నూరు కాపు రాజ్యాధికారం పార్టీ జిల్లా అధ్యక్షులు వారద్ స్వర్ణలత పటేల్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె నవతెలంగాణతో మాట్లాడుతూ..రాజకీయ పార్టీల నాయకులు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని దూరంగా పెడుతున్నారని ఆరోపించారు..ఎక్కువ సార్లు రెడ్డి వర్గానికే చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా పాలకులు బిసి సామాజిక వర్గానికి డిసీసీబి చైర్మన్ పదవి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.







కామెంట్‌లు (0)