Magazines

"వంశధార" కవిత్వం అద్భుతం

2 గంటల క్రితం

Vamsadhara
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

- పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్

నవతెలంగాణ - హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీలో ఐటీ సెల్ కానిస్టేబుల్ నారాయణరావు కురిటి రచించిన ‘వంశధార’ వచన కవితా సంపుటి ఆవిష్కరణ బుధవారం జరిగింది. దూత రామ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ..

"సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, నిరంతరం విధుల్లో బిజీగా ఉంటూనే నాలుగేళ్ల పాటు శ్రమించి ఇంత చక్కటి పుస్తకాన్ని ఆయన తీసుకురావడం సిటీ పోలీస్‌కు గర్వకారణమన్నారు.


బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీస్ సిబ్బంది చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా.. క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం, రచనలు, యోగా వంటి సృజనాత్మక అభిరుచులను అలవర్చుకుని మానసిక ప్రశాంతత పొందాలని సూచించారు. ఏఐ సాంకేతికత ఎంత విస్తరించినా మానవ హృదయం నుంచి వచ్చే భావోద్వేగాలను, పుస్తకం ఇచ్చే స్పర్శను ఎప్పటికీ భర్తీ చేయలేదని చెప్పారు. కానిస్టేబుల్ నారాయణరావుకు నా హృదయపూర్వక అభినందనలు" అంటూ కవిని ప్రశంసించారు.


విశిష్ట అతిథిగా వచ్చిన బీసీ స్టడీ సర్కిల్ చైర్మన్ డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఏ సంస్కృతి అయినా నదీ తీరాల్లోనే ప్రారంభమవుతుందని, నదులు మానవ మనుగడకు ఎంతో ఉపకరిస్తాయని, వంశధార పేరుతో నారాయణరావు కవిత సంపుటిని తీసుకురావడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు.


అనంతరం సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ పుస్తక సమీక్ష చేస్తూ.. "నారాయణరావు కవిత్వం వస్తు వైవిధ్యంతో శిల్పశోభితంగా ఉందని, మారుతున్న ఆధునికతను, అర్థం చేసుకుని నవ్య రీతుల్లో కవిత్వం రాశారని వంశధార కవితా సంపుటి తనకు మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శిఖరం రాజ్ కుమార్, సాయి కృష్ణ పాల్గొని కవిని అభినందించారు. ఆవిష్కరణ అనంతరం తన తల్లిదండ్రులకు కావ్యాన్ని ఘనంగా అంకితం ఇచ్చారు. అనంతరం కవి స్పందిస్తూ ఇంతలా ప్రోత్సహించిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్