నవతెలంగాణ-అచ్చంపేట
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు పోలీసులు భరోసా కల్పించాలని అచ్చంపేట డిఎస్పి శ్రీనివాసులు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం అచ్చంపేట పోలీస్ స్టేషన్ ను డిఎస్పి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బాధితులు ఇచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి, పారదర్శక విచారణ ద్వారా సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో గల స్థానిక రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు. రిసెప్షన్, రైటర్, ఇతర సిబ్బంది పనితీరును సమీక్షించి, పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్సై నరేష్‌ను ఆదేశించారు. డి.ఎస్.పి వెంట అచ్చంపేట సిఐ నాగరాజు ఉన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు భరోసా కల్పించాలి: డీఎస్పీ
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)