Magazines

సత్తుపల్లి ఏరియాలో ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

59 నిమిషాల క్రితం

Vigilance Awareness
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం సరికొండ వెంకటాచారి ఆదేశాల మేరకు అన్ని ఉపరితల గనుల్లో (ఓసీ), విభాగాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు-2026 సోమవారం  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉద్యోగులందరితో విజిలెన్స్ సత్యనిష్ఠా ప్రతిజ్ఞ చేయించారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి. వెంకన్న (ఐఆర్‌టీఎస్) తన సందేశంలో ఉద్యోగులంతా క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నిజాయతీలతో పనిచేసి సింగరేణిని ఉన్నత స్థాయికి చేర్చాలని కోరారు.


ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం మేనేజర్ బొల్లం శ్రీనివాస్, సత్తుపల్లి ఏరియా గనుల అధికారుల సంఘం (సీఎంఓఏఐ) అధ్యక్షుడు, ప్రాజెక్టు అధికారి ఎస్వీ సునీల్ వర్మ, కిష్టారం ఉపరితల గని ప్రాజెక్టు ఇంజనీర్ జీవీ రావు, జేవీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప ప్రధాన వైద్యాధికారి బి. నరసింహారావు పాల్గొన్నారు. అలాగే జేవీఆర్, కిష్టారం ఉపరితల గనుల అధికారులు  రాజేశ్వరరావు, బి. రామకృష్ణ, విద్యుత్,  యంత్రాల విభాగపు ఆధిపత్య ఇంజనీర్ పి. సాయినాథ్, కొనుగోలు అధికారి ముక్కు మోహన్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. సుధాకర్, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మురళి, సంక్షేమ అధికారి కె. శ్రీనివాస్, పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్