Magazines

బ్యాట్‌తో తఢాఖా చూపించిన వరంగల్ పోలీస్ కెప్టెన్ విశ్వేశ్వర్

1 గంట క్రితం

Warangal Police
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

47 బంతుల్లో 90 పరుగులు..
10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఇన్‌స్పెక్టర్

నవతెలంగాణ – గీసుగొండ 

త్వరలో జరగనున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌కు సన్నాహకంగా నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో వరంగల్ పోలీస్ క్రికెట్ జట్టు కెప్టెన్, గీసుగొండ ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ బ్యాట్‌తో సత్తా చాటారు. ఏడు పోలీస్ బెటాలియన్ల క్రీడాకారులతో కూడిన రేంజ్–1 పోలీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.


కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో అజేయంగా 90 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ జట్టులో నూతనోత్సాహాన్ని నింపారు. అద్భుతమైన ఆటతీరుతో బెస్ట్ బ్యాటర్‌గా నిలవడంతో పాటు 8.95 ఎంవీపీ రేటింగ్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు ముందు విశ్వేశ్వర్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వరంగల్ పోలీస్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. రాబోయే పోటీల్లో వరంగల్ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్