నెలకు రూ.55 నుంచి రూ.200 కడితే
60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పెన్షన్
నవతెలంగాణ - మల్హర్ రావు
రైతుల వృద్ధాప్య జీవనానానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్ ధన్ పథకం ఇటీవలే తెలిసింది. నెలకు తక్కువ మొత్తాన్ని చెల్లించి వృద్ధాప్యంలో పెన్షన్ పొందే అవకాశం ఉండటం రైతులకు ఎంతో ఉపయోగకరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు ఈ పథకం గురించి సరైన అవగాహన కల్పించడం లేదు. వ్యవసాయ అధికారులు గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా ప్రచారం నిర్వహిస్తే మరింత మంది రైతులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.
పీఎం మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రతీనెలా కొంత మొత్తం చెల్లిస్తే రైతులు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పింఛన్ పొందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ మాన్ ధన్ పథకానికి 18 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సు లోపు ఉన్న రైతులు అర్హులు. ప్రతీనెలా రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం బ్యాంక్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన ప్రీమియం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమానంగా చెల్లిస్తుంది.
రైతు మరణిస్తే ఆయన భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తర్వాత రైతుకు రూ.3వేల వరకు, ఒక వేళ రైతు మరణిస్తే ఆయన భార్యకు రూ.1500 పెన్షన్ వస్తుంది. రైతు ఫొటో,నివాస దృవీకరణ పత్రం, సాగుభూమి, ఆదాయం వంటి వివరాల పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
లబ్దిదారులు కామన్ సర్వీస్ సెంటర్, పీఎం కిసాన్, సీఎం కేఎంవై పోర్టల్ దరఖాస్తు చేసుకోవాలి. రైతు మొదట తన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమీయం డబ్బు చెల్లించాలి. ప్రతీనెలా ఆటోమెటిక్ గా డబ్బులు ఖాతా నుంచి పథకంలో జమవుతాయి. నామిని వివరాలను నమోదు చేయాలి. మాన్ ధన్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని పింఛన్ లబ్దిదారులు కానట్లయితే సీఎస్ సీలో మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకొని పింఛన్‌కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం డబ్బులను నగదు రూపంలో చెల్లించాలి. ఆ తరువాత బ్యాంక్ ఖాతాను జత చేసుకోవాలి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి: శ్రీజ మండల వ్యవసాయాధికారి
చిన్న, సన్నకారు రైతుల వృద్దాప్య జీవితానికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనను అమలు చేస్తోంది. 18ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల రైతులు ఈ ఫథకంలో చేరవచ్చు. రైతుల నుంచి స్పందన లభిస్తోంది. అర్హులైన ప్రతి రైతు ఈ పథకంలో నమోదు చేసుకొని వృద్ధాప్య భద్రతను పొందాలి. బ్యాంక్ అధికారులతో కలిసి ఈ పథకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.






కామెంట్లు (0)