భూభారతి ఆపరేటర్ల ఆవేదన
నవతెలంగాణ-అచ్చంపేట
ఉప్పునుంతల మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 115లో 13 ఏకరాల 17 గుంటలు భూ అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో మా ప్రమేయం లేదని భూభారతి ఆపరేటర్లు రాజ్ కుమార్, గౌస్ బాబాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు నవతెలంగాణతో మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా జిల్లా కలెక్టర్ మమ్ములను సస్పెండ్ చేశారని వాపోయారు. అయ్యవారిపల్లి భూముల రిజిస్ట్రేషన్ సమయంలో నేను విధుల్లో లేనని ఆపరేటర్ రాజకుమార్ తెలిపారు.
ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలో ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (FTS)గా TSTS సంస్థ ద్వారా విధులు నిర్వహించానని గుర్తు చేశారు.
సర్వే నంబర్ 115కు సంబంధించిన దరఖాస్తులు నా లాగిన్ ద్వారా ప్రాసెస్ కాలేదనీ, ఈ విషయాన్ని సంబంధిత లాగిన్ వివరాలు, డిజిటల్ ఆడిట్ ట్రైల్ మరియు దరఖాస్తుల ప్రాసెసింగ్ రికార్డుల ద్వారా నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. నాకు ఏలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, నా వివరణ కోరకుండా, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకుండా అక్రమ భూ రిజిస్ట్రషన్‌లో నా పాత్ర ఉందని నన్ను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. దీనివల్ల జీవనోపాధి కోల్పోవడంతో పాటు మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. ఈ వ్యవహారంలో నా వాదనను, నా వద్ద ఉన్న ఆధారాలను చట్టపరమైన మార్గంలో సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. వాస్తవాలు పూర్తిగా పరిశీలించకుండా నా పేరును నేరపూరిత వ్యవహారంతో ముడిపెట్టవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)