Magazines

శత్రాజ్ పల్లి ఇండ్ల బాధితులను ఆదుకోవాలి

1 గంట క్రితం

Minister Sridhar Babu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించిన సర్పంచ్  స్వామి, బాధితులు

నవతెలంగాణ - మల్హర్ రావు

తాడిచెర్ల గ్రామ పరిధిలోగల శాత్రజ్ పల్లిలో ఈ నెల 10న అర్ధరాత్రి అక్రమంగా 347 ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని మంగళవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి, బాధితులు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు విన్నవించారు.


సంబంధిత అధికారులపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. శాత్రజ్ పల్లిలోని భూములను వ్యవసాయ పనులకు, నివాస అవసరాలు, పశువుల సంరక్షణ నిమిత్తం సొంత ఖర్చులతో నిర్మించుకుని వినియోగించుకుంటున్నామని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చడం దారుణమన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా, అధికారులతో మాట్లాడుతామని చెప్పినట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్