Magazines

దీపావళికైనా వెలుగులు నిండేనా.?

1 రోజు క్రితం

Diwali
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

కొత్తపింఛన్దారుల్లో ఆశలు

నవతెలంగాణ - మల్హర్ రావు

కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మండలంలో అనేక మంది అర్హులైన వారు దరఖాస్తు చేశారు. దసరా పండుగ సందర్భంగానే పింఛన్లు అందిస్తామని చెప్పినా ఇంకా అమలుకాలేదు. దీపావళి పండుగకు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొత్త పింఛన్దారుల్లో నిరాశ నెలకొంది. పింఛన్ సొమ్ము తమకు కొండంత అండ ఇస్తుందనే ఆశతో వందలాది మంది ఎదురు చూస్తున్నారు.

మండలంలో దరఖాస్తులు 496

చేయూత పింఛన్ల కోసం గత ఆగస్టు 9 నుంచి సె ప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో మండలంలో వితంతువులు, దివ్యాంగులు, గీతకార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులతోపాటు బోదకాలు, డయాలసిస్ బాధితులు మొత్తంగా 496 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సెప్టెంబర్ 30 వరకు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి 496 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. అయితే, దీపావళి పండుగకైనా కొత్త పింఛన్ అందుతుందా? అని వీరంతా ఎంతోఆశతో ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్