నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు “నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్” విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. దేశంలో సగానికి పైగా వాహనాలు మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా, సరైన బీమా రక్షణ లేకుండానే రోడ్లపై నడుస్తున్నాయని, ఇది అత్యంత ఆందోళనకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను అధిగమించేందుకు ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ విధానం ఒక ఉత్తమ మార్గమని అభిప్రాయపడింది. ఈ విధానం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. మొదటిది, ఇన్సూరెన్స్ లేని వాహనాలను సులభంగా గుర్తించవచ్చు. రెండోది, వాహన యజమానులకు వారి ఇన్సూరెన్స్ గడువు ముగిసిందనే విషయాన్ని గుర్తు చేసినట్లు అవుతుందని వివరించింది.
ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



