Saturday, June 20, 2026
E-PAPER
Homeబీజినెస్ఎలాన్ బై క్యాంపస్ బ్రాండ్ అంబాసిడర్ జిమ్ సర్భ్

ఎలాన్ బై క్యాంపస్ బ్రాండ్ అంబాసిడర్ జిమ్ సర్భ్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: మారుతున్న వినియోగదారుల అభిరుచులు జీవనశైలి అవసరాలను తీర్చడానికి, క్యాంపస్ యాక్టివ్‌వేర్ పోర్ట్‌ ఫోలియోను స్పోర్ట్స్ అథ్లీజర్ కు మించి విస్తరింపజేస్తుంది. జీవితంలోని వివిధ సందర్భాలలో సునాయాసంగా మెరుపు వేగంతో కదిలి వెళ్లే పురుషుల కోసం రూపొందించబడింది ఈ ‘ఎలాన్ బై క్యాంపస్’. దీనిద్వారా, ఉన్నతమైన స్టైల్‌ను రోజంతా సౌకర్యంతో మేళవించి, సాంప్రదాయ ఫార్మల్ ఫుట్‌వేర్‌కు ఒక సొగసైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ కలెక్షన్ లో ఉన్నతమైన డిజైన్‌ రావడం వల్ల ఇది రోజువారీ వాడకానికి అనువుగా ఉంటుంది. ఇది ఆఫీసు వేళలు, వ్యాపార సమావేశాల నుండి డిన్నర్ ప్లాన్‌లు, వారాంతపు విహారయాత్రలు మధ్యలో వచ్చే అన్ని సందర్భాలకూ అప్రయత్నమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ ప్రారంభోత్సవం సందర్బంగా విజువల్ గా అద్భుతంగా ఉన్న క్యాంపెయిన్ ఫిల్మ్ ని లాంచ్ చేశారు. ఈ ఫిల్మ్.. ఫ్యాషన్ ద్వారా ఏ పురుషుడు అయినా అద్భుతంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కన్పించవచ్చేనే థీమ్ ని ప్రజెంట్ చేసింది.

ఈ క్యాంపెయిన్ ఫిల్మ్ లో, జిమ్ సర్భ్ తన సహజ రూపంలో, ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పూర్తి సౌకర్యంగా కనిపిస్తాడు. ఫిల్మ్ కు బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతమైన మ్యూజిక్ వస్తుండగా…,అతను ఒక మినిమల్, స్టైలైజ్డ్ ప్రపంచంలోకి ప్రవేశించి, ఆ తర్వాత ‘ఎలాన్ బై క్యాంపస్’ షూస్‌ను ధరిస్తాడు. ఆ తర్వాత జరిగేది అతని ట్రాన్స్ ఫార్మేషన్ కాదు, అతనిలోని అనేక కోణాల ఆవిష్కరణ. అన్నింటికి మించి ప్రశాంతమైన వృత్తి నిపుణుడు, చురుకైన ప్రయాణికుడు భావాలను వ్యక్తపరిచే ఫ్యాషన్ ప్రియుడు. కదలిక, భావోద్వేగం సినిమాటిక్ దృశ్య భాష ద్వారా, ఈ చిత్రం హుందాతనాన్ని ఒక సహజ లక్షణంగా, ప్రదర్శన కన్నా నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం, బహుముఖ ప్రజ్ఞ ఉనికితో నిర్వచించబడిన ఒక వైఖరిగా ప్రదర్శిస్తుంది.

సినిమాటిక్ విజువల్స్, చురుకైన కదలికలు సమకాలీన సౌందర్యంతో, ఈ క్యాంపెయిన్.. మన సంస్కృతి, మన స్టైల్ ఆకాంక్షల ద్వారా లోతైన కథని, అదే సమయంలో క్యాంపస్ యాక్టివ్‌వేర్ అభివృద్ధి చెందుతున్న విధానాన్ని ప్రతిబింబిస్తుంది. షార్ప్ విజువల్ ట్రీట్‌మెంట్, స్టైలింగ్ ప్రీమియం టోనాలిటీతో, ‘ఎలాన్ బై క్యాంపస్’ అనేది ప్రత్యేకంగా కనిపించడానికి ఎక్కువగా ప్రయత్నించని, కేవలం అలా కనిపించే పురుషుల కోసం హుందాతనానికి ఒక ఆధునిక వ్యక్తీకరణగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -